Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కరోనా ఉధృతి: లక్షా 6 వేలు దాటిన పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. నిజామాబాద్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో కోరనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 6 వేలు మార్కు దాటింది.

Coronavirus postive cases in Telangana cross 1 lakh 6 thousand
Author
hyderabad, First Published Aug 24, 2020, 9:25 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో 1825 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 6091 చేరుకుంది. 

తాజాగా తెలంగాణలో గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ తో ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 761కి చేరుకుంది. ఇప్పటి వరకు 82,411 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మరో 22919 మంది ఆస్పత్రుల్లో కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. 

నిజామాబాద్ జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో 158 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ జిల్లాలో 32 కేసులు మాత్రమే రికార్డయ్యాయి. కరీంనగర్ కరోనా కేసులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో 134 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

జిల్లాలవారీగా తెలంగాణలో గత 24 గంంటల్లో నమోదైన కేసుల సంఖ్య

ఆదిలాబాద్ 23
భద్రాద్రి కొత్తగూడెం 37
జిహెచ్ఎంసి 373
జగిత్యాల 70
జనగామ 24
జయశంకర్ భూపాలపల్లి 1
జోగులాంబ గద్వాల 33
కామారెడ్డి 20
కరీంనగర్ 134
ఖమ్మం 77
కొమరం భీము ఆసిఫాబాద్ 5
మహబూబ్ నగర్ 42
మహబూబాబాద్ 64
మంచిర్యాల 59
మెదక్ 13
మేడ్చెల్ మల్కాజిగిరి 32
ములుగు 12
నాగర్ కర్నూలు 32
నల్లగొండ 47
నారాయణపేట 4
నిర్మల్ 10
నిజామాబాద్ 158
పెద్దపల్లి 44
రాజన్న సిరిసిల్ల 13
రంగారెడ్డి 109
సంగారెడ్డి 50
సిద్ధిపేట 86
సూర్యాపేట 113
వికారాబాద్ 11
వనపర్తి 50
వరంగల్ రూరల్ 8
వరంగల్ అర్బన్ 74
యాదాద్రి భువనగిరి 14
మొత్తం కేసులు 1842

 

Follow Us:
Download App:
  • android
  • ios