హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 1763 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో తెలంగాణ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 95700కు చేరుకుంది.

తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 719కి చేరుకుంది. గత కొద్ది రోజులుగా హైదరాబాదులో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో హైదరాబాదులో 484 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది.

ఆదిలాబాద్ 8
బద్రాద్రి కొత్తగూడెం 35
జిహెచ్ఎంసీ 484
జగిత్యాల 61
జనగామ 20
జయశంకర్ భూపాలపల్లి 17
జోగులాబం గద్వాల 30
కామారెడ్డి 63
కరీంనగర్ 53
ఖమ్మం 41
కొమురం భీమ్ ఆసిఫాబాద్ 6
మహబూబ్ నగర్ 33
మహబూబాబాద్ 18
మంచిర్యాల 55
మెదక్ 17
మేడ్చెల్ మల్కాజిగిరి 169
ములుగు 12
నాగర్ కర్నూలు 15
నల్లగొండ 65
నారాయణపేట 6
నిర్మల్ 16
నిజామాబాద్ 45
పెద్దపల్లి 46
రాజన్న సిరిసిల్ల 31
రంగారెడ్డి 166
సంగారెడ్డి 31
సిద్ధిపేట 37
,సూర్యాపేట 20
వికారాబాద్ 8
వనపర్తి 21
వరంగల్ రూరల్ 31
వరంగల్ అర్బన్ 88
యాదాద్రి భువనగిరి 15
మొత్తం 1763