హైదరాబాదులో తగ్గని కరోనా: తెలంగాణలో 73 వేలు దాటిన కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 73 వేల మార్కును దాటింది. హైదరాబాదులో ప్రతి రోజూ 500కు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 13 మంది మృత్యువాత పడ్డారు.

Coronavirus positive cases cross 73 thousand in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 2092 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,050కు చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్ తో 13 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 589కి చేరుకుంది. 

హైదరాబాదులో కరోనా వైరస్ వ్యాప్తి యధావిధిగానే కొనసాగుతోంది. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 535 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఈ జిల్లాలో గత 24 గంటల్లో 123 కేసులు రికార్డయ్యాయి. మేడ్చెల్ మల్కాజిరిగి జిల్లాలో కూడా 126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల పరిస్థితి కూడా అదే. రంగారెడ్డి జిల్లాలో 169, వరంగల్ అర్బన్ జిల్లాలో 128 కేసులు నమోదయ్యాయి. 

 

ఆదిలాబాద్ జిల్లాలో 17, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 36, జగిత్యాల జిల్లాలో 28, జనగామ జిల్లాలో 26, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 21, జోగులాంబ గద్వాల జిల్లాలో 72, కామారెడ్డి జిల్లాలో 28, ఖమ్మం జిల్లాలో 64 కేసులు నమోదయ్యాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సున్నా కేసులు నమోదయ్యాయి. 

మహబూబ్ నగర్ జిల్లాలో 48, మహబూబాబాద్ జిల్లాలో 16, మంచిర్యాల జిల్లాలో 43, మెదక్ జిల్లాలో 18, ములుగు జిల్లాలో 27, నాగర్ కర్నూలు జిల్లాలో 22, నల్లగొండ జిల్లాలో 52, నారాయణపేట జిల్లాలో 6, నిర్మల్ జిల్లాలో 25, నిజామాబాద్ జిల్లాలో 91, పెద్దపల్లి జిల్లాలో 54 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 83, సంగారెడ్డి జిల్లాలో 101, సిద్ధిపేట జిల్లాలో 20, సూర్యాపేట జిల్లాలో 34, వికారాబాద్ జిల్లాలో 9, వనపర్తి జిల్లాలో 34, వరంగల్ రూరల్ జిల్లాలో 24, యాదాద్రి భువనగిరి జిల్లాలో 12 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios