తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 77 వేలు దాటింది. రంగారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో కేసులు పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి విస్తరిస్తూనే ఉంది. గత 24 గంటల్లో తెలంగాణలో 2296 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 77 వేల 70కి చేరుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా గత 24 గంటల్లో పది మంది మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో కరోనాతో మరణించివారి సంఖ్య 1062కు చేరుకుంది. రంగారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో గతంలో కన్నా కాస్తా కేసుల సంఖ్య పెరిగినట్లు కనిపిస్తోంది. జిల్లాలో గత 24 గంటల్లో 217 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో 312 కేసులు రికార్డయ్యాయి.

తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

ఆదిలాబాద్ 18
భద్రాద్రి కొత్తగూడెం 77
జిహెచ్ఎంసీ 321
జగిత్యాల 50
జనగామ 36
జయశంకర్ భూపాలపల్లి 11
జోగులాంబ గద్వాల 21
కామారెడ్డి 77
కరీంనగర్ 136
ఖమ్మం 69
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 16
మహబూబ్ నగర్ 31
మహబూబాబాద్ 72
మంచిర్యాల 37
మెదక్ 23
మేడ్చెల్ మల్కాజిగిరి 173
ములుగు 24
నాగర్ కర్నూలు 36
నల్లగొండ 155
నారాయణపేట 6
నిర్మల్ 19
నిజామాబాద్ 82
పెద్దపల్లి 40
రాజన్నసిరిసిల్ల 67
రంగారెడ్డి 217
సంగారెడ్డి 81
సిద్ధిపేట 92
సూర్యాపేట 73
వికారాబాద్ 23
వనపర్తి 37
వరంగల్ రూరల్ 30
వరంగల్ అర్బన్ 99
యాదాద్రి భువనగిరి 47

Scroll to load tweet…