Asianet News TeluguAsianet News Telugu

కరోనా కంటైన్మెంట్ జోన్లలో కేటీఆర్ పర్యటన: ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం

కరోనా వైరస్ కారణంగా హైదరాబాద్‌లోని రెడ్‌జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్‌లలో గురువారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఖైరతాబాద్ పరిధిలోని సిఐబి క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటెన్న్మెంట్ జొన్లను సందర్శించిన మంత్రి అక్కడి ప్రజలతో మాట్లాడారు
coronavirus Containment Areas Visited by Minister KTR in hyderabad
Author
Hyderabad, First Published Apr 16, 2020, 3:04 PM IST
కరోనా వైరస్ కారణంగా హైదరాబాద్‌లోని రెడ్‌జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్‌లలో గురువారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఖైరతాబాద్ పరిధిలోని సిఐబి క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటెన్న్మెంట్ జొన్లను సందర్శించిన మంత్రి అక్కడి ప్రజలతో మాట్లాడారు.

కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్... కరోనా వైరస్ పట్ల అవగాహన ఉందా..?, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రచురించిన కరపత్రాలు, ఇతర సమాచారం మీకు చేరిందా అని అడిగి తెలుసుకున్నారు.

మరింతగా ప్రజలు వైరస్ బారిన పడకుండా కాపాడేందుకు  ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా  కొన్ని పరిమితులు విధించిందని, అందులో భాగంగానే కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేసిందని కేటీఆర్ తెలిపారు.

కరొనా వ్యాప్తి, కంటైన్ మెంట్ జోన్ల పరిమితులు, నిబంధనల పైన పూర్తిగా అవగాహన ఉన్నవారు తమ పక్క న ఉన్న వారికి మరింత అవగాహన కల్పించి ఇంటికే పరిమితం అయ్యేలా చూడాలని కోరారు.

కరోనా లక్షణాలు గనుక కనిపిస్తే స్థానిక అధికారులను సంప్రదించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ బయటకి రాకుండా ఇళ్ల కి పరిమితం కావడం ద్వారానే సురక్షితంగా ఉండగలుగుతాం అని, లేదంటే కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని మంత్రి హెచ్చరించారు.

కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి సారించి, గమనిస్తూ ఉండాలని.. ట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఎలాంటి వైద్య సహకారం కావాలన్నా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని సూచించారు.

కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ఈ మేరకు కంటైన్ మెంట్ జోన్ లో ఉన్న స్థానికులకు కాస్తంత భరోసా ఇచ్చేందుకు తాను స్వయంగా ఇక్కడికి వచ్చానని కేటీఆర్ తెలిపారు. 
Follow Us:
Download App:
  • android
  • ios