హైదరాబాద్ కు భారీ ఊరట: తెలంగాణలో 92 వేలు దాటిన కరోనా కేసులు

కరోనా వైరస్ వ్యాధి విషయంలో హైదరాబాదుకు భారీ ఊరట లభించింది. గత 24 గంటల్లో కేవలం 147 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 92 వేలు దాటింది.

Coronavirus cases cross 92 thousand in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉంది. అయితే, హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాల్లో గత 24 గంటల్లో కరోనా వైరస్ లు తగ్గుముఖం పట్టడం శుభసూచకం. ఈ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతూ వచ్చాయి. 

తాజాగా గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో గత 147 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అలాగే మేడ్చెల్ మాల్కాజిగిరి జిల్లాలో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 85 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణవ్యాప్తంగా గత 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

గత 24 గంటల్లో తెలంగాణలో 894 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 92,254కు చేరుకుంది. గత 24 గంటల్లో 10 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో మరణాల సంఖ్య 703కు చేరకుుంది. ఇప్పటి వరకు 70132 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా 21,420 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మూడు జిల్లాల్లో జీరో కేసులు నమోదయ్యాయి. నిర్మల్, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో గత 24 గంటల్లో కేసులేవీ నమోదు కాలేదు.

తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య

ఆదిలాబాద్ 10
భద్రాద్రి కొత్తగూడెం 9
జిహెచ్ఎంసీ 147
జగిత్యాల 31
జనగామ 7
జయశంకర్ భూపాలపల్లి 0 
జోగులాంబ గద్వాల 21 
కామారెడ్డి 7
కరీంనగర్ 69
ఖమ్మం 44
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 11
మహబూబ్ నగర్ 30
మహబూబాబాద్ 31
మంచిర్యాల 17
మెదక్ 8
మేడ్చెల్ మల్కాజిగిరి 51
ములుగు 6
నాగర్ కర్నూలు 15
నల్లగొండ 37
నారాయణపేట 0
నిర్మల్ 0
నిజామాబాద్ 38
పెద్దపల్లి 62
రాజన్న సిరిసిల్ల 2
రంగారెడ్డి 85
సంగారెడ్డి 29
సిద్ధిపేట 58
సూర్యాపేట 12
వికారాబాద్ 1
వనపర్తి 2
వరంగల్ రూరల్ 9
వరంగల్ అర్బన్  44
యదాద్రి భువనగిరి 1
మొత్తం కేసులు 894

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios