హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోరనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా 1863 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90259కి చేరకుంది. 

కాగా, తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో కోవిడ్ వ్యాధితో పది మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంక్య 684కు చేరుకుంది. శనివారం ఉదయం తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ బులిటెన్ విడుదల చేసింది. 

తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య

ఆదిలాబాద్ 18
భద్రాద్రి కొత్తగూడెం 36
జిహెచ్ఎంసీ 394
జగిత్యాల 61
జనగామ 34
జయశంకర్ భూపాలపల్లి 12
జోగులాంబ గద్వాల 58
కామారెడ్డి 31
కరీంనగర్ 104
ఖమ్మం 61
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 12
మహబూబ్ నగర్ 18
మహబూబాబాద్ 14
మంచిర్యాల 7
మెదక్ 36
మేడ్చెల్ మల్కాజిగిరి 175
ములుగు 13
నాగర్ కర్నూలు 24
నల్లగొండ 49
నారాయణపేట 5
నిర్మల్ 28
నిజామాబాద్ 39
పెద్దపల్లి 40
రాజన్న సిరిసిల్ల 90
రంగారెడ్డి 131
సంగారెడ్డి 81
సిద్ధిపేట 60
సూర్యాపేట 33
వికారాబాద్ 16
వనపర్తి 26
వరంగల్ రూరల్ 41
వరంగల్ అర్బన్ 101
యదాద్రి భువనగిరి 15
మొత్తం కేసులు 1863