మంచిర్యాల జిల్లాలో తొలి కేసు: మృతి చెందిన తర్వాతే మహిళకు కరోనా గుర్తింపు
: మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇటీవల మృతి చెందిన మహిళకు కరోనా ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో ఆ మహిళ కుటుంబానికి చెందిన 11 మందిని క్వారంటైన్ కు తరలించనున్నారు అధికారులు.
మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇటీవల మృతి చెందిన మహిళకు కరోనా ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో ఆ మహిళ కుటుంబానికి చెందిన 11 మందిని క్వారంటైన్ కు తరలించనున్నారు అధికారులు.
మంచిర్యాల జిల్లాలో ఇంతవరకు కరోనా కేసులు నమోదు కాలేదు. అయితే నాలుగు రోజుల క్రితం ఓ మహిళ మృతి చెందింది. చెన్నూరు మండలం మత్తెరావుపల్లి గ్రామానికి చెందిన మహిళ కరోనాతో మృతి చెందింది. మృతి చెందిన తర్వాత ఆమెకు కరోనా ఉన్న విషయం తేలింది.
అనారోగ్యంతో ఆ మహిళ మంచిర్యాలలో చికిత్స తీసుకొంది. అయితే కరోనా లాంటి లక్షణాలు ఉన్నాయని భావించిన స్థానిక వైద్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని గాంధీ వైద్యులు చెప్పారు. దీంతో ఆమెను కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. కింగ్ కోఠి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఈ మహిళ మృతికి కారణాలు తెలుసుకొనేందుకు శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. అయితే ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా ఉందని తేలింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
also read:ఇండియాపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 1,007 కొత్త కేసులు, 23 మంది మృతి
మృతురాలి కుటుంబానికి చెందిన 11 మందిని క్వారంటైన్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు ఈ మహిళకు చికిత్స చేసిన మంచిర్యాల, హైద్రాబాద్ కు చెందిన వైద్యులకు కూడ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని ఈ మహిళకు కరోనా ఎలా సోకిందనే విషయమై వైద్యులు ఆరా తీస్తున్నారు. ఈ గ్రామానికి రాకపోకలను నిలిపివేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించనున్నారు.