81 శాతం మందిలో కరోనా లక్షణాలు లేవు: ఈటల
81 శాతం మందికి ఎలాంటి కరోనా లక్షణాలు కనపడవని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. 19 శాతం మందికి మాత్రమే డాక్టర్ల సేవలు అవసరం ఉంటాయని ఆయన తెలిపారు.
కామారెడ్డి:81 శాతం మందికి ఎలాంటి కరోనా లక్షణాలు కనపడవని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. 19 శాతం మందికి మాత్రమే డాక్టర్ల సేవలు అవసరం ఉంటాయని ఆయన తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధులపై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైద్యులు కనబడని శత్రువుతో పోరాటం చేస్తున్నారన్నారు.చరిత్రలో వైద్యుల సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని చెప్పారు.
also read:హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా: కుటుంబసభ్యులకు నెగిటివ్
భగవంతుని తర్వాత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నది వైద్యులు మాత్రమేనని తెలిపారు.కరోనా బారినుండి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ముఖ్యమంత్రి ఎంత ఖర్చయినా పర్వాలేదని సీఎం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కంటెన్మెంట్ అనే పదానికి అర్థం చెప్పింది తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు. సంపూర్ణంగా లాక్ డౌన్ ను అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. తమిళ్ నాడు ,కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల కంటే మెరుగైన ఫలితాలు తెలంగాణలో మాత్రమే వస్తున్నాయని ఆయన చెప్పారు.
మరణాల రేటు కూడా తెలంగాణ రాష్ట్రంలో తక్కువగానే ఉందన్నారు.
హాస్పిటల్లో గతంలో కంటే వెంటిలేటర్ అధిక మొత్తంలో సమకూర్చుకున్నామని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు, కొంతమంది మేధావులు, మీడియా. వైద్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు, వార్తలను ప్రచురించడం బాధ కల్గిస్తోందని ఆయన చెప్పారు.కష్టకాలంలో సేవలందిస్తున్న వైద్యులను అభినందించడం పోయి విమర్శలు చేయడం, వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని ఆయన చెప్పారు.