హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా: కుటుంబసభ్యులకు నెగిటివ్
హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా సోకింది. గతంలో రెండు దఫాలు ఆయన పరీక్షలు నిర్వహించుకొన్నా ఆయనకు నెగిటివ్ వచ్చింది. తాజాగా నిర్వహించుకొన్న పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది.
హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా సోకింది. గతంలో రెండు దఫాలు ఆయన పరీక్షలు నిర్వహించుకొన్నా ఆయనకు నెగిటివ్ వచ్చింది. తాజాగా నిర్వహించుకొన్న పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది.
ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ గా బొంతు రామ్మోహన్ కు నిర్ధారణ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. మేయర్ కుటుంబసభ్యులకు మాత్రం కరోనా సోకలేదు. మేయర్ కుటుంబసభ్యులందరికి పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్ వచ్చింది.
also read:జీహెచ్ఎంసీలో ఆగని కరోనా జోరు:తెలంగాణలో మొత్తం 54,059కి చేరిక
కరోనా వచ్చినా కూడ మేయర్ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు మేయర్. అక్కడి నుండే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మేయర్ సమీక్ష సమావేశం నిర్వహించాడు.
జూన్ 8వ తేదీన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఓ టీ స్టాల్ వద్ద మేయర్ టీ తాగాడు. ఈ టీ స్టాల్ లో పనిచేసే మాస్టర్ కు కరోనా సోకింది. ఈ విషయం అధికారులు చెప్పడంతో ఆ సమయంలో ఆయన పరీక్షలు నిర్వహించుకొన్నాడు. ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది.
ఆ తర్వాత నాలుగు రోజులకే మేయర్ రామ్మోహన్ కారు డ్రైవర్ కూడ కరోనా బారినపడ్డాడు. దీంతో ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడ పరీక్షలు నిర్వహించుకొన్నారు. కానీ ఎవరికి కూడ కరోనా సోకలేదు.
అయితే ఎలాంటి లక్షణాలు లేకుండానే తాజాగా నిర్వహించుకొన్న పరీక్షలో ఆయనకు కరోనా ఉన్నట్టుగా తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇటీవల కాలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మేయర్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో కూడ పలు సమీక్షలు నిర్వహించారు. అయితే మేయర్ కు కరోనా సోకినట్టు తేలడంతో మేయర్ తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడ పరీక్షలు నిర్వహించుకోనున్నారు.