శవాల మీద చిల్లర ఎరుకునే బాపతు : కరోనాతో ఓ వ్యక్తి మృతి, బిల్లు కడితేనే మృతదేహం
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సామాజిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా కార్పోరేట్ ఆసుపత్రులు ఈ వైరస్ బారినపడిన వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయి
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సామాజిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా కార్పోరేట్ ఆసుపత్రులు ఈ వైరస్ బారినపడిన వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయి.
చికిత్సకు అయిన బిల్ కడితే కానీ మృతదేహాలను అప్పగించేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ కార్పోరేట్ హాస్పిటల్ ఇలాగే వ్యవహరించింది. లక్షల రూపాయల బిల్లులు వేసి కడితే కానీ విడిచిపెట్టమని బెదిరిస్తున్నాయి.
Also Read:విజృంభిస్తున్న కరోనా: కేసీఆర్ ఎక్కడ...?
జూన్ 25న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో నిమ్మ బసవ నాగరాజు అనే వ్యక్తి జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన శనివారం ప్రాణాలు కోల్పోయారు.
అయితే మొత్తం 7 లక్షల 20 వేల రూపాయల బిల్లు వేశారు. నాలుగు లక్షల ఇన్సూరెన్స్ క్లయిమ్ అయ్యిందని మిగిలిన 3 లక్షల 20 వేలు చెల్లిస్తే కానీ మృతదేహాన్ని ఇవ్వమని సిబ్బంది బెదిరిస్తున్నారు.
Also Read:ప్రైవేట్ ఆసుపత్రి నుండి నిమ్స్ కు డాక్టర్ సుల్తానా తరలింపు: చర్యలకు ఈటల ఆదేశం
అంతేకాకుండా తమ కుటుంబాన్ని నిర్బంధించి వేధిస్తున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు నాగరాజుకు ఇతర వ్యాధులేవి లేవని హార్ట్, కిడ్నీలకు ఎఫెక్ట్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.