తెలంగాణాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ ఏ ప్రాంతంలో కొత్త కేసులు నమోదవుతున్నాయో అర్థం కాని పరిస్థితి. సామాన్యుడు సెలబ్రిటీ అనే తేడా లేకుండా వైరస్ అందరిని పట్టి పీడిస్తుంది. 

ఇక కరోనా మహమ్మారి కేసీఆర్ ఇంటికి కూడా చేరింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో దాదాపుగా 30 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రగతి భవన్ లో కేసులు నమోదవుతుండడంతో...... కేసీఆర్ తన మకాన్ని ఫార్మ్ హౌస్ కి మార్చారు. 

కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో.... ప్రజలంతా కేసీఆర్ ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో కేసీఆర్ కనిపించకుండా పోవడంపై ప్రజలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఏకంగా "వేర్ ఈజ్ కేసీఆర్" అని ట్రెండ్ అవుతుంది. 

కేసీఆర్ తనయుడు కేటీఆర్ సైతం కరోనా పై ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ట్విట్టర్ లో ఎవరికీ ఏ చిన్న ఆపద వచ్చిందన్నా ముందుండి సహాయం చేసే కేటీఆర్ కరోనా వైరస్ వల్ల మాకు ఊపిరాడక సచ్చిపోతున్నామంటూ రోగులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నప్పటికీ.... ఆయన కూడా స్పందించటం లేదు.

తెలంగాణాలో కరోనా టెస్టింగ్ తక్కువగా ఉందనేది అక్షర సత్యం. ఇన్ని తక్కువ కేసులు చేస్తున్నప్పటికీ... అత్యంత ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో అత్యధిక కరోనా పోసిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా ఉండవలిసిన కేసీఆర్ అందుబాటులో లేకుండా పోయారు. 

కేసీఆర్ కనబడకపోవడంతో... నెటిజన్లు అంతా కరోనా వైరస్ అనేది అసలు మహమ్మారి కాదు అని మార్చ్ లో కేసీఆర్ చెప్పిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. లెక్కలతో సహా ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. 

50 వేల టెస్టులను వారం రోజుల్లో నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం 18 రోజుల్లో ఆ తంతును పూర్తి చేసిందని సోషల్ మీడియాలో పంచులు వేస్తున్నారు నెటిజన్లు. రికవరీ రేటు అధికంగా ఉందని చూపెట్టడానికి ప్రజలను కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే డిశ్చార్జ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.