Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కరోనా వ్యాప్తి... పోలీసులకు డిజిపి కీలక ఆదేశాలు

తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రంలోని అన్నిపోలీస్ కమీషనర్లు, ఎస్పిలు, పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డీజీపీ మహేందర్ రెడ్డి.

corona outbreak in telangana... DGP Mahender Reddy Video Conference With Police  akp
Author
Hyderabad, First Published Apr 9, 2021, 4:37 PM IST

హైదరాబాద్: దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి నివారణపై రాష్ట్రంలోని అన్నిపోలీస్ కమీషనర్లు, ఎస్పిలు, పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డీజీపీ మహేందర్ రెడ్డి.

ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైసేషన్ తదితర కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని డీజీపీ ఆదేశించారు. కోవిడ్ రెండవ విడత రాష్ట్రంలో తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నందున దీని నివారణకు మరోసారి పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 

స్థానిక స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సహాయ సహాకారాలతో కోవిడ్ నివారణ చర్యలు, వాక్సినేషన్ వేసుకోవడం, మాస్క్ లను ధరించడం తదితర నివారణ చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని డిజిపి ఆదేశించారు.

read more  ఊహించని రీతిలో కరోనా కేసులు, అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఈటల 

ఇదిలావుంటే తెలంగాణలో తాజాగా గత 24గంటల్లో (బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) 1,01,986మందికి కరోనా టెస్టులు చేయగా 2478మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,21,182కు చేరితే టెస్టుల సంఖ్య 1,07,61,939కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 363మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,03,964కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,472యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 9,674గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1746కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.3శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 91.2శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 94.63శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 33, నాగర్ కర్నూల్ 43, జోగులాంబ గద్వాల 9, కామారెడ్డి 98, ఆదిలాబాద్ 72, భూపాలపల్లి 11, జనగామ 23, జగిత్యాల 105, అసిఫాబాద్ 67, మహబూబ్ నగర్ 96, మహబూబాబాద్ 16, మెదక్ 33, నిర్మల్ 111, నిజామాబాద్ 176,  సిరిసిల్ల 61, వికారాబాద్ 55, వరంగల్ రూరల్ 14,  ములుగు 4, పెద్దపల్లి 33, సిద్దిపేట 54, సూర్యాపేట 39, భువనగిరి 27, మంచిర్యాల 85, నల్గొండ 88 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 402కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 208, రంగారెడ్డి 162, కొత్తగూడెం 35, కరీంనగర్ 87, ఖమ్మం 54, సంగారెడ్డి 79, వరంగల్ అర్బన్ 82కేసులు నమోదయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios