కరోనా వైరస్ వల్ల ఎందరో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.... ఈ కరోనా వైరస్ మాత్రం ఒక వ్యక్తి జీవిత్వంలో సంతోషాన్ని నింపింది. 33 సంవత్సరాలుగా 10వ తరగతి పరీక్ష పాస్ అవడానికి నానా తంటాలు పడుతున్న ఒక వ్యక్తి పాలిట ఈ కరోనా వరంగా మారింది. 

ఈ సంఘటన మన తెలంగాణలో చోటు చేసుకుంది. మొహమ్మద్ నూరుద్దీన్ అనే 51 సంవత్సరాల వ్యక్తి గత 33 ఏండ్లుగా 10వ తరగతి పరీక్షా పాస్ అవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం కరోనా పుణ్యమాని అందరిని పాస్ చేయడంతో 33 ఏండ్లుగా 10వ తరగతిపైన నూరుద్దీన్ చేస్తున్న పోరాటంలో అంతిమంగా విజయం సాధించాడు. 

1987లో నూరుద్దీన్ తొలిసారి 10వ తరగతి పరీక్షలు రాసాడు. అప్పటినుండి 33 సంవత్సరాల కాలంలో అనేకసార్లు రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను రాసాడు. ఇంగ్లీష్ పరీక్ష తన వీక్ పాయింట్ అంటున్నాడు నూరుద్దీన్. 2019 వరకు ఈ 33ఏండ్ల కాలంలో అనేకసార్లు పరీక్ష రాసినప్పటికీ... ఆయన పాస్ కాలేకపోయాడట. 

ప్రతిసంవత్సరం ఎంత కష్టించి చదివినా 30 నుంచి 33 మార్కుల మధ్య మాత్రమే వస్తున్నాయి తప్ప, ఎప్పుడు పాస్ అవలేదు అంటున్నాడు. 35 మార్కుల పాస్ మార్కు గీతను చేరుకోవడంలో వరుస వైఫల్యాలను ఎదుర్కున్నట్టుగా చెప్పాడు ఈ అవిశ్రాంత యోధుడు. 

ఈ సంవత్సరం రెగ్యులర్ ఎగ్జామ్దట దాటిపోవడంతో ఓపెన్ లో కట్టాడట. అన్ని సబ్జెక్టులుమరల రాయ్లసుంటుందని చెప్పినప్పటికీ... ఎలాగైనా 10వ తరగతి పరీక్షలో పాస్ అవ్వాలని నిశ్చయించుకున్న ఈ వారియర్ ఫీజు కట్టాడట. 

హాల్ టికెట్ కూడా తెచ్చుకున్నాడు. పరీక్షలు వాయిదా పడడం, అందరిని పాస్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం అన్ని వెరసి నూరుద్దీన్ తన కలను నిజం చేసుకున్నాడు. తనను పాస్ చేసినందుకు కేసీఆర్ కి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాడు.