Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు: 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు

 తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది.  లాక్‌డౌన్ కూడ కరోనా కేసుల తగ్గుదలలో కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయంతో అధికారులున్నారు. 

corona cases in Telangana dropped: says Telangana Health director
Author
Hyderabad, First Published May 19, 2021, 9:57 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది.  లాక్‌డౌన్ కూడ కరోనా కేసుల తగ్గుదలలో కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయంతో అధికారులున్నారు. ఈ నెల 1 నుండి 18 వరకు కరోనా పాజిటివిటీ రేటు 4.17 శాతానికి తగ్గినట్టుగా వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 18 రోజుల నుండి కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 81.57 నుండి 90.48 శాతానికి పెరిగింది. 

ఈ నెలలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిన విధానాన్ని కూడా వైద్య ఆరోగ్యశాఖ ఆ నివేదికలో వివరించింది. ఈ నెల 1 నుండి 7,430 కొత్త కేసులు నమోదైతే 18న 3,982 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. మార్చి 1న 9.78 శాతం పాజిటివ్ రేటు నమోదు కాగా ఈ నెల 18న 5.56 శాతానికి తగ్గింది. ఈ నెల మొదటివారంలో 8.69 పాజిటివిటీ రేటు తగ్గింది. రెండో వారంలో 7.22 శాతానికి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో తొలుత నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేసింది. కరోనా  విషయమై హైకోర్టు ఆదేశాల మేరకు నైట్ కర్ఫ్యూను అమలు చేసింది. ఆ తర్వాత లాక్‌డౌన్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకొంది. లాక్‌డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం.

Follow Us:
Download App:
  • android
  • ios