పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో హైద్రాబాద్ లో శోభాయాత్రను మంగళవారం నాడు బజరంగ్ దళ్ రద్దు చేసుకొంది. 


హైదరాబాద్: పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో హైద్రాబాద్ లో శోభాయాత్రను మంగళవారం నాడు బజరంగ్ దళ్ రద్దు చేసుకొంది.సోమవారం నాడు 21 మందితో హైద్రాబాద్ లో హనుమాన్ శోభాయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే శోభాయాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో యాత్రను రద్దు చేసుకొంటున్నట్టుగా భజరంగ్ దళ్ ప్రకటించింది.ఈ శోభాయాత్రను మొత్తం వీడియో తీసి సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ర్యాలీలో 21 మంది మాత్రమే పాల్గొనాలని స్పష్టంగా పేర్కొంది. కోవిడ్ నిబంధనలను పాటించాలని ర్యాలీ నిర్వాహకులను కోర్టు ఆదేశించింది. 

also read:షరతులతో హనుమాన్ శోభాయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి

&

Scroll to load tweet…

nbsp;

గౌలిగూడ రామ్‌మందిరం నుండి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించుకొనేందుకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే మంగళవారం నాడు పెద్ద ఎత్తున భక్తులు ర్యాలీలో పాల్గొనేందుకు గౌలిగూడకు చేరుకొన్నారు. దీంతో ర్యాలీని భజరంగ్ దళ్ రద్దు చేసుకొంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నగరంలో పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు శోభాయాత్రలో పాల్గొంటారు. ప్రతి ఏటా ఈ యాత్రను అత్యంత వైఁభవంగా నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో ఈ దఫా ర్యాలీ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చినా చివరి నిమిషంలో శోభాయాత్రను నిర్వాహకులు రద్దు చేసుకొన్నారు.