హైద్రాబాద్ నగరంలో  ఈ నెల 27వ తేదీన  హనుమాన్ శోభాయాత్రకు షరతులతో  తెలంగాణ హైకోర్టు  సోమవారం నాడు అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో ఈ నెల 27వ తేదీన హనుమాన్ శోభాయాత్రకు షరతులతో తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు అనుమతి ఇచ్చింది.ఈ నెల 27వ తేదీ ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు శోభాయాత్రకు షరతులతో అనుమతి ఇచ్చింది. శోభాయాత్ర వీడియోను తీసి సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

గౌలిగూడ రామ్ మందిర్ నుండి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో 21 మందికి మించవద్దని కూడ హైకోర్టు సూచించింది. తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ ర్యాలీ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ర్యాలీ విషయంలో తమ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని హైకోర్టు సూచించింది.

కరోనా సమయంలో పెద్ద ఎత్తున జనం గుమికూడితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కోవిడ్ ప్రోటోకాల్స్ ను పాటించాల్సిందేనని హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు గాను నైట్ కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.