మేడ్చల్ జిల్లా (medchal district) కీసరలో (keesara) ఏడుగురు పేకాట రాయుళ్లను (gambling) అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ రిసార్ట్ రూమ్‌లో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.65 వేలు, 5 మొబైల్స్, పేకాట కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

మేడ్చల్ జిల్లా (medchal district) కీసరలో (keesara) ఏడుగురు పేకాట రాయుళ్లను (gambling) అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ రిసార్ట్ రూమ్‌లో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.65 వేలు, 5 మొబైల్స్, పేకాట కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అధికార టీఆర్ఎస్‌కు (trs) చెందిన మహిళా కార్పోరేటర్ల భర్తలు వున్నారు. దీంతో పోలీసులకు రాజకీయ నేతల నుంచి ఫోన్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. జవహర్ నగర్ కార్పోరేషన్ మూడవ డివిజన్ కార్పోరేటర్ భర్త బల్లి శ్రీనివాస్, నాలుగో డివిజన్ కార్పోరేటర్ భర్త మరుగొని వెంకటేశ్, 9వ డివిజన్ కార్పోరేటర్ భర్త మనోధర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred