Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేల ప్రలోభాలపై ప్రత్యేక బృందంతో విచారణకై బీజేపీ పిటిషన్:రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

మొయినాబాద్  ఫాం హౌస్ లో  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు గురి చేశారనే అంశంపై  ప్రత్యేక బృందంతో విచారణ కోరుతూ బీజేపీ దాఖలు  చేసిన పిటిషన్  పై విచారణను హైకోర్టు  రేపటికి వాయిదా వేసింది.

Telangana High  Court  Adjourns  Bjp Petition Tomorrow  Over Moinabad Farm House  Incident
Author
First Published Oct 28, 2022, 1:06 PM IST

హైదరాబాద్: మొయినాబాద్ ఫాం హౌస్ లో  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి  చేసిన అంశంపై  ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని  బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను  తెలంగాణ హైకోర్టు  శనివారానికి వాయిదా  వేసింది.

మొయినాబాద్ ఫాంహౌస్  లో నలుగురు  తమ పార్టీ ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు గురి చేశారని  బీజేపీపై  టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ  విషయమై ప్రత్యేక దర్యాప్తు బృందంతో  విచారణ  జరిపించాలని కోరుతూ  బీజేపీ ఈ నెల  27న  హైకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేసింది.ఈ పిటిషన్  ను  విచారణకు స్వీకరించింది హైకోర్టు.  ఈ పిటిషన్  పై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు  గురి చేశారనే  ఆరోపణలపై  మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్   రెడ్డి  ఇచ్చిన ఫిర్యాదు  మేరకు  ఈ నెల 26న ముగ్గురిని  పోలీసులు అరెస్ట్  చేశారు.

ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, తిరుపతికి చెందిన  సింహయాజీ,  హైద్రాబాద్  కు  చెందిన నందును పోలీసులు అరెస్ట్ చేశారు. తమ ఎమ్మెల్యేలను ఈ ముగ్గురు ప్రలోభాలకు గురి చేశారని టీఆర్ఎస్ ఆరోపించింది. బీజేపీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో ఈ విషయమై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ  జరిపించాలని బీజేపీ డిమాండ్  చేసింది. ఈ ఘటనపై ప్రత్యేక  దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ  బీజేపీ  రిట్  పిటిషన్  ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా  వేసింది హైకోర్టు.

తెలంగాణ  పోలీసుల తీరుపై బీజేపీ అభ్యంతరం  వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రత్యేక  దర్యాప్తు బృందం  నియమించేలా ఆదేశాలు  జారీ చేయాలని బీజేపీ  డిమాండ్  చేసింది. పైలెట్ రోహిత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం,  రాష్ట్ర  ప్రభుత్వం, మొయినాబాద్ ఎస్ హెచ్ఓ ,సైబారాబాద్ సీపీ సహా ఎనిమిది మందిని  బీజేపీ  ప్రతివాదులుగా చేర్చిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios