Asianet News TeluguAsianet News Telugu

Telangana Omicron cases : టోలిచౌకి పారామౌంట్ కాలనీలో కంటైన్మెంట్ జోన్

హైదరాబాద్ నగరంలోని Tolichowki పారామౌంట్ కాలనీలో బుధవారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ ఆ ప్రాంతంలో కరోనా ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్ కేసులు బయటపడిన వారి నివాసాలకు సమీపంలోని 25ఇళ్ల పరిధిలో కంటైన్ మెంట్ జోన్ ఏర్పాటు చేశారు.

Containment zone in Tolichowki  Paramount Colony due to  Omicron cases in Telangana
Author
Hyderabad, First Published Dec 16, 2021, 2:43 PM IST

హైదరాబాద్ : నగరంలోని Tolichowki పారామౌంట్ కాలనీలో బుధవారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ ఆ ప్రాంతంలో కరోనా ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్ కేసులు బయటపడిన వారి నివాసాలకు సమీపంలోని 25ఇళ్ల పరిధిలో కంటైన్ మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా దేశాల నుంచి నగరానికి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్థారణ అయిన విషయం తెలిసిందే. వారిని గచ్చిబౌలిలోని టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌‌లో రెండు Omicronకేసులు నమోదు కావడంతో Telangana వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒమిక్రాన్ సోకిన ఇద్దరితో ప్రైమరీ కాంటాక్టులు పొందిన వారి సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖాధికారులు  సేకరించారు. కెన్యా నుండి వచ్చిన మహిళతో పాటు సోమాలియా నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ Srinivasa Rao ప్రకటించారు. ఈ ఇద్దరితో ప్రైమరీ కాంటాక్టుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖాధికారులు సేకరించారు. 

ఒమిక్రాన్ సోకిన ఇద్దరిని హైద్రాబాద్ టిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఇద్దరి ప్రైమరీ కాంటాక్టులో 136 మంది ఉన్నారని  గుర్తించారు. వీరికి కరోనా RTPCR పరీక్షలు నిర్వహిస్తున్నారు.  వీరిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కు పంపనున్నారు. 

సోమాలియా నుండి వచ్చిన వ్యక్తి  ఎక్కడెక్కడికి తిరిగాడు... ఆయన ఎవరెవరిని కలిశారో ట్రేస్ చేసి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పారమౌంట్ కాలనీలో ఇవాళ మరికొందరికి పరీక్షలు చేస్తున్నారు. 40 మంది వైద్య సిబ్బందితో పారామౌంట్ అపార్ట్ మెంట్ లో   పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఫలితాలు 48 గంటల్లో రానున్నాయి.

కాగా, కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరికి  ఒమిక్రాన్ నిర్దారణ అయినట్టుగా  తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు బుధశారం నాడు ప్రకటించారు. అందులో ఒకరు 24 ఏళ్ల మహిళని.. ఆమె కెన్యానుంచి ఈ నెల 12న తెలంగాణకు వచ్చారని చెప్పారు. ఆ యువతి టోలిచౌకిలో ఉన్నట్టు గుర్తించామన్నారు. ఆమె ఇంట్లోని ఇద్దరిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారని తెలిపారు. వారి శాంపిల్స్‌ను ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌కు పంపించినట్టుగా వెల్లడించారు. యువతిని ప్రస్తుతం గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించినట్టుగా చెప్పారు. 

హైద్రాబాద్‌లో డ్రగ్స్ తరలిస్తూ ముగ్గురి అరెస్ట్: నిందితుల్లో మహిళా టెక్కీ

రెండో వ్యక్తి సోమాలియా నుంచి వచ్చిన 23 ఏళ్ల వ్యక్తి అని  శ్రీనివాస్ రావు తెలిపారు. నాన్ రిస్క్‌ కంట్రీ నుంచి రావడంతో.. పరీక్షలు నిర్వహించి ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లేందుకు అనుమతించినట్టుగా తెలిపారు. ఇతను కూడా టోలిచౌకి ప్రాంతంలో ఉంటున్నట్టుగా చెప్పారు. మరోకరికి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయిందని.. అతడు 7 ఏళ్ల బాలుడని తెలిపారు. బాలుడి స్వస్థలం బెంగాల్‌ అని.. రాష్ట్రంలోకి రాలేదని వెల్లడించారు. 

అతడు విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి.. కోల్‌కతాకు వెళ్లినట్టుగా చెప్పారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ వైద్యారోగ్య శాఖకు తెలియజేయడం జరిగిందని చెప్పారు. బాధితుల్లో పెద్దగా లక్షణాలు లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ, హైదరాబాద్‌లోని స్థానికులకు ఎక్కడా ఒమిక్రాన్ సోకలేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు ఉన్నట్టుగా వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios