Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో డ్రగ్స్ తరలిస్తూ ముగ్గురి అరెస్ట్: నిందితుల్లో మహిళా టెక్కీ

హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో డ్రగ్స్ తీసుకెళ్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా ఘట్‌కేసర్ సీఐ చంద్రబాబు తెలిపారు.డ్రగ్స్ తరలిస్తున్న వారిలో ఓ మహిళా కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

Hyderabad Police Arrested Three for distributiing drugs
Author
Hyderabad, First Published Dec 16, 2021, 12:20 PM IST

హైదరాబాద్: Goa నుండి డ్రగ్స్ తీసుకొస్తూ Hyderabad ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మహిళా Techie కూడా ఉన్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం Drugs తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సీఐ చంద్రబాబు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు అందించారు. మంగళవారం నాడు సాయంత్రం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ కారులో ఇద్దరు యువకులు ఒ మహిళ అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం ఆధారంగా తమ పోలీస్ బృందం  దాడులు నిర్వహించిందన్నారు.

also read:టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు ముగింపు...!!

కారులో ఉన్న హెహిదీపట్టణం విజయనగర్‌కాలనీకి చెందిన మహ్మద్ జమీర్ సిద్దిఖ్, హఫీజ్‌పేట గోపాల్ నగర్ లోని నివాసం ఉంటున్న మహిళా టెక్కీ పులి Ramya , అల్మాస్ గూడ శేషాద్రినగర్ లో నివాసం ఉంటున్న కౌకుంట్ల Anilను అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు.  వీరి నుండి 9.4 గ్రాముల డ్రగ్స్ తో పాటు Ganjaని స్వాధీనం చేసుకొన్నామన్నారు.నిందితులు ఉపయోగించిన Carను కూడా సీజ్ చేశామన్నారు.ఈ ముగ్గురు కడా క్లబ్ హౌస్ అనే Online  యాప్ ద్వారా పరిచయమయ్యారన్నారు. హైద్రాబాద్ గచ్చిబౌలిలోని ఓ క్లబ్‌లో ఈ ముగ్గురు తరచు కలుసుకొనే వారని పోలీసులు చెప్పారు. కౌకుంట్ల అఖిల్ గోవా వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి తెచ్చేవాడని తమ దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు. ఈ డ్రగ్స్ ను రమ్యకు సిద్దిఖ్‌కు ఇచ్చేవారని చెప్పారు.  నూతన సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లి వీరు ముగ్గురు డ్రగ్స్ కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios