వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అహ్మద్ బాషా  ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. ఆయన శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అహ్మద్ బాషా ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. ఆయన శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

స్థానికుల సమాచారం మేరకు కమిషనరేట్ తో పనిచేస్తున్న అహ్మద్ ను ఇటీవల భూపాలపల్లికి బదిలీ చేశారు. దీంతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది అహ్మద్ ను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అహ్మద్ గతంలో ములుగు జిల్లా పస్రలో పనిచేసి ఇటీవలే కమిషనరేట్ కు బదిలీపై వచ్చారు. ఆ వెంటనే భూపాలపల్లికి బదిలీ చేయడంతో వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నానన్న బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.