నాగర్‌కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో యువకులను అసభ్య పదజాలంతో దూషించడం వివాదాస్పదమైంది.ఈ వీడీయోను యువకులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. 

ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. యువకులను అసభ్య పదజాలంతో దూషించిన కానిస్టేబుల్ శివశంకర్ ను పోలీసు ఉన్నతాధికారులు  సస్పెండ్ చేశారు. అంతేకాదు శివశంకర్ ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

ఓ యువకుడు ఎంత సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా కూడ కానిస్టేబుల్ శివశంకర్ మాత్రం తన నోటి దురుసును మాత్రం తగ్గించుకోలేదు.
 నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడు.

కానిస్టేబుల్ దూషిస్తున్న సమయంలో యువకులు ఈ తతంగాన్ని వీడియో తీశారు.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం శివశంకర్ పై చర్య తీసుకొనేందుకు సాక్ష్యంగా పనికొచ్చింది.

రాత్రి సమయంలో కానిస్టేబుల్ శివశంకర్ యువకులను దూషించారు. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ యువకులు సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్టు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.