మిర్యాలగూడ:
మిర్యాలగూడలో ఒక కానిస్టేబుల్ ప్రస్తుతం పోలీసు వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యారు. ఆయన చేసిన పనేంటంటే..? సొంత ఇంట్లో ఉన్న అవినీతి కంపును బయటపెట్టడమే. ఎంతో సాహసానికి ఒడిగట్టి ఆ కానిస్టేబుల్ ఏకంగా సిఐ అయిన తన బాస్ గుట్టు మొత్తం సోషల్ మీడియా సాక్షిగా విప్పేశారు. పూర్తి వివరాల కోస కింద వీడియోను, వార్తను చదవండి మరి.

మిర్యాలగూడ టూటౌన్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ నెలవారి మామూళ్లకు అడ్డుపడుతున్నందుకు తనను వేధిస్తున్నారని సెల్ఫీ వీడియోలో ఆధారాలతో వెల్లడించారరు కానిస్టేబుల్ రాజ్ కుమార్. సిఐ అక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తనపై కక్ష కట్టి  విధులకు హజరైనా అబ్సెంట్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. ప్రతి చిన్న పనిలోనూ లంచం వసూలు చేయడమే సిఐ సాయి ఈశ్వర్ గౌడ్ ప్రయత్నమని వివరించారు. మొత్తానికి ఈ సిఐ, కానిస్టేబుల్ వార్ లో ఓడిపోయేదెవరో? గెలిచి నిలిచేదెవరో? చూడాలి.