సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, కానిస్టేబుల్ మృతి

First Published 21, Jun 2018, 9:51 AM IST
Constable killed in road accident at Sangareddy
Highlights

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ...

సంగారెడ్డి జిల్లాలో ఇవాళ ఉదయం రోడ్డుమ ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. 

ఈ రోడ్డు ప్రమాదం హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంద్రేశం గ్రామ సమీపంలో జరిగింది.  ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని మోహన్‌రెడ్డి గా స్థానికులు గుర్తించారు. ఇతడు గుమ్మడిదల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 

ఈ  యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కానిస్టేబుల్ మృతదేహాన్న పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

మోహన్ రెడ్డి మరణ వార్త విని అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అలాగే అతడు పనిచేసే గుమ్మడిదల పోలీసులు కూడా మోహన్ రెడ్డి మృతిపై సంతాపం ప్రకటించారు.
 

loader