Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో దారుణం...నడిరోడ్డుపై కానిస్టేబుల్ ను కారుతో గుద్ది పరారైన ఆగంతకుడు (వీడియో)

విధుల్లో వున్న కానిస్టేబుల్ ను ఓ ఆగంతకుడు కారుతో గుద్ది గాయపర్చిన ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగుచూసింది.  

Constable injured car accident in Hyderabad AKP
Author
First Published Oct 20, 2023, 3:11 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున హిట్ ఆండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులపైకే కారు పోనిచ్చి దారుణంగా వ్యహరించాడో ఆగంతకుడు. కారు ఆపడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. గాయపడ్డ కానిస్టేబుల్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే... అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ చిలకలగూడలో  పోలీసులు కూడా బారికేడ్లను ఏర్పాటుచేసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ కారు అటువైపు వేగంగా దూసుకురాగా కానిస్టేబుల్ మహేష్ ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ కారు డ్రైవర్ ఆపకుండా కానిస్టేబుల్ పైకి కారు పోనిచ్చాడు. అంతటితో ఆగకుండా కానిస్టేబుల్ ను ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో కిందపడిపోయిన కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డాడు.

వీడియో

ఈ ప్రమాదంలో గాయపడ్డ మహేష్ ను తోటి పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన మొత్తం దగ్గర్లోని సిసి కెమెరాలో రికార్డవగా దాని ఆదారంగా కారును గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ తో పాటు విధుల్లో వున్న పోలీస్ ను గాయపర్చిన నిందితుడిని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios