ప్రేమించానని మాయమాటలు  చెప్పాడు.పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా పెళ్లి చేసుకోమని యువతి అడిగితే మొహం చాటేశాడు. ఆ నిందితుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఓ కానిస్టేబుల్ కావడం గమనార్హం. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా..పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read పానీపూరీ ఇప్పిస్తానని ఆశచూపించి... బాలికను బాత్రూమ్ కి తీసుకెళ్లి..

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బడంగ్ పేట నివాసి ఎ. శివకుమార్(24) ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని కూడా మాయ మాటలు చెప్పాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వాళ్ల ఇంటికే వెళ్లి... ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా యువతి పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేశాడు.

అనంతరం గత నెల 11న మరో యువతి మెడలో తాళికట్టాడు. మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు తాజాగా పోలీసులను ఆశ్రయించింది. కానిస్టేబుల్‌ తనను మోసం చేశాడంటూ బాధితురాలు మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి పరారీలో ఉన్న శివకుమార్‌ను గురువారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.