కేసిఆర్ కిట్లు ఏమో.. పాణాలు తియ్యకురి : కాంగ్రెస్ మణెమ్మ (వీడియో)

congress zptc manemma fire on kcr
Highlights

గర్భిణీ మృతిపై ఆగ్రహం

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ స్థానిక జెడ్పీటిసి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొండా మణెమ్మ ధర్నా చేపట్టారు. తెలంగాణ సర్కారు కొండా మణెమ్మ నిప్పులు చెరిగారు. కేసిఆర్ కిట్ల పేరుతో హడావిడి చేయడం పక్కనపెట్టి ముందు గర్భిణీల ప్రాణాలు కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.

"

 

నాగర్ కర్నూలులోని గవర్నమెంట్ హస్పిటల్ లో గురువారం రాత్రి ఉయ్యాల వాడ కి చేందిన క్రిష్ణ వేణి అనే గర్భిణి డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డు మీద ధర్నా కు దిగారు మణెమ్మ.

బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మణెమ్మ ఏమన్నారో పైన వీడియోలో చూడండి. ధర్నా చేయడంతో అధికారులు స్పందించి కృష్ణవేణి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె భర్తకు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

loader