Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ఢిల్లీకి దేక్కూంటూ పోయినా తెలంగాణ వచ్చేది కాదు:పొన్నం

టీఆర్ఎస్ చీఫ్ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు. లేకపోతే కేసీఆర్‌ ఢిల్లీ దాకా దేక్కుంటూ పోయినా రాష్ట్రం ఏర్పడేది కాదని వ్యాఖ్యానించారు.

congress working president ponnam prabhakar fires on kcr
Author
Karimnagar, First Published Oct 24, 2018, 4:22 PM IST

కరీంనగర్‌: టీఆర్ఎస్ చీఫ్ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు. లేకపోతే కేసీఆర్‌ ఢిల్లీ దాకా దేక్కుంటూ పోయినా రాష్ట్రం ఏర్పడేది కాదని వ్యాఖ్యానించారు. పిరికి వాళ్లు అభద్రతా భావంతో వ్యవహరించినట్లు కేసీఆర్‌ అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. 

టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను విస్మరించి కేసీఆర్‌ మాటల గారడీతో కాలం గడిపారని పొన్నం ధ్వజమెత్తారు. పెన్షనర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఇస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు మిగిల్చిందని ఘాటుగా విమర్శించారు. 

డబ్బు, మతంతో వచ్చేవారికి గుణపాఠం చెప్పాలని సూచించారు. కేసీఆర్‌ది నోరా లేక మోరీయా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేతగాని దద్ధమ్మలు మమ్మల్ని విమర్శిస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు టీఆర్‌ఎస్‌, బీజేపీ బంధం అనేక సందర్భాల్లో బయటపడిందని గుర్తు చేశారు. వారిద్దరి మధ్య ఫెవికోల్‌గా ఎంఐఎం ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ అమలు చేసిందని పొన్నం తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios