ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రాజకీయ పార్టీకి ఓటేయాలని చెబుతున్నారని  కొడంగల్ జూనియర్ కాలేజీ పోలింగ్ స్టేషన్‌ వద్ద  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  శుక్రవారం నాడు  ధర్నాకు దిగారు. 


కొడంగల్: ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రాజకీయ పార్టీకి ఓటేయాలని చెబుతున్నారని కొడంగల్ జూనియర్ కాలేజీ పోలింగ్ స్టేషన్‌ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం నాడు ధర్నాకు దిగారు. 

కొడంగల్ ప్రభుత్వ కాలేజీ పోలింగ్ స్టేషన్‌ పరిధిలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈవీఎంలోని ఓ నెంబర్ గుర్తుకే ఓటేయాలని రిటర్నింగ్ అధికారి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు.

ఈ ఆందోళన విషయం తెలుసుకొన్న ఎస్పీ అవినాష్ మహంతి పోలింగ్ స్టేషన్‌ను వద్దకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం నుండి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


సంబంధిత వార్తలు

కొడంగల్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ, ఉద్రిక్తత