Asianet News TeluguAsianet News Telugu

ఆ నియోజకవర్గాలపై తెలంగాణ కాంగ్రెస్ నజర్

కొప్పుల రాజు రివ్యూ

congress uttam review on reserved constituencies

రిజర్వ్డ్ నియోజకవర్గాలలో పార్టీ పనితీరును మరింత మెరుగు పరిచేందుకు ఏర్పాటు చేసిన ఎల్.డి.ఎం.ఆర్.సి ( లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ ఇన్ రిజర్వ్ఢ్ కానిస్టెన్సీన్ ) పనితీరు చాల బాగుందని ప్రతి ఓటర్ కు నాయకత్వంతో అనుబంధానమయ్యేలా చేయడమే కాకుండా బూత్ స్థాయిలో నాయకులు ఓటర్తో నేరుగా కలిసి వారి సమస్యలలో పాలు పంచుకోవడం లాంటి పనులు పార్టీకి చాల మేలు చేస్తాయని, ఇది తెలంగాణలోని మొత్తం నియోజకవర్గాలలో విస్తరించాలని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు గోల్కోండ హోటల్లో ఎల్.డి.ఎం.ఆర్.సి సమీక్ష సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఎఐసిసి నాయుకలు కొప్పుల రాజు, కార్య నిర్వహక అధ్యక్షులు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ప్రతి ఓటరుతో నాయకత్వంలో అనుసంధానంగా ఉండేలా సాంకేతికంగా పూర్తిస్థాయిలో సంసిద్దం కావాలని, రాబోయే ఎన్నికలలో సాంకేతిక వనరుల ప్రభావం చాల ఉంటుందని ఈ విషయంలో పార్టీ మరింత లోతుగా సమాచార సేకరణ చేయాలని ఆయన సూచించారు. గతంతో పోలిస్తే ఇప్పడు సాంకేతిక ప్రభావం ఎన్నికలపైన చాల ఉందని, ఈ విషయంలో ఎల్.డి.ఎం.ఆర్.సి పనితీరు చాల బాగుందని 31 నియోజకవర్గంలో సమాచార సేకరణ బాగా చేశారని దీన్ని మిగతా జనరల్ నియోజకవర్గాలలో కూడా చేపట్టి ఎన్నికల నాటికి సమగ్రంగా సమాచార సేకరణ చేసి విరివిగా ఉపయోగించుకునేలా చేయాలని ఆయన సూచించారు. 

కాంగ్రెస్ పార్టీ సాంకేతిక విభాగం రూపొందించిన సమాచార పత్రాల ద్వారా బూత్ లెవల్ నాయకులు ప్రజల వద్దకు వెళ్ళి వారి నుంచి సమాచారం సేకరించి తద్వారా వారికి అవసరమైన సహాయ, సహాకారాలు అందించగలిగితే ప్రజలకు కాంగ్రెస్కు మరింత చేరువ అవుతారని ఆయన వివరించారు. ఈ విషయంలో సాంకేతికంగా సేకరించిన సమాచారాన్ని రూపొందించిన విధానాన్ని క్షుణ్ణంగా  పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఎఐసిసి నాయకులు కొప్పుల రాజు మాట్లాడుతూ మిగతా నియోజకవర్గాలలో కూడా ఇదే విధమైన సమాచార సేకరణ చేసి, పనులు ప్రారంభించాలని, ఈ గ్రూపుల ద్వారా ఓటర్ మ్యాపింగ్ పద్దతిని పకడ్బందీగా చేయాలని, ఈ సమాచార సేకరణను పార్టీకి మరింత లోతుగా ఉపయోగపడేలా రూపొందించాలని సూచించారు. తెలంగాణ‌లో 30, 600 బూత్‌లున్నాయ‌ని ప్ర‌తి బూత్‌కు 14 మందితో బూత్ క‌మిటీలు వేయాల‌ని, మొత్తంగా నాలుగున్న‌ర ల‌క్షల మంది కాంగ్రెస్ సుశిక్షితులైన కాంగ్రెస్ సైన్యాన్ని త‌యారు చేయాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తి బూత్‌కు ఒక సుశిక్షుత‌డైన సోష‌ల్ మీడియా కో ఆర్డినేట‌ర్‌ను నియ‌మించి పార్టీని సాంకేతికంగా, సంస్తాగ‌తంగా ప‌టిష్టం చేయాల‌ని సూచించారు.  ఎఐసిసి అధ్య‌క్షులు రాహుల్ గాంధీ ఈ వ్య‌వ‌హారంలో చాల సీరియ‌స్ గా ఉన్నార‌ని ఆయ‌న ఆదేశాల మేర‌కు ఈ కార్య‌క్ర‌మాల‌ను స‌కాలంలో పూర్తి చేయాల‌ని ఆయ‌న సూచించార‌. తెలంగాణ  ప్రభుత్వం పట్ల ఏ వర్గాలైతే అసంతృప్తిగా ఉన్నాయో గుర్తించి వారితో మరింత సన్నిహితంగా ఉండేలా చూసుకోవాలని, యువత, నిరుద్యోగులు తెలంగాణ ప్రభుత్వ వైఖరితో విసిగిపోయారని 18 నుంచి 35 ఏళ్ళ వయస్సున్న వారు ప్రభుత్వ పనితీరు పట్ల తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారని ఆయన వివరించారు. 

 ఎఐసిసి ఎస్.సి సెల్ కన్వీనర్ ప్రసాద్ తెలంగాణలో ఎల్.డి.ఎం.ఆర్.సి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రిజర్వ్డ్ 31 నియోజకవర్గాలలో 75655 మందితో బూత్ కమిటీలు వేయడం జరిగిందని వివరించారు. 18901 మందితో మండల స్థాయి కమిటీలు, 603 మందితో బ్లాక్ స్థాయి కమిటీలు వేయడం జరిగిందని అన్నారు. 22,299 మందితో గ్రామ కమిటీల నిర్మాణం జరిగిందని, 752 ఎబిసిలను నియమించడం జరిగిందని, 1,18,210 మంది డాటా సేకరణ చేశామని, అందులో 93 వేల మంది మోబైల్ నెంబర్లతో సహా సేకరణ జరిగిందని, 27 వేల మంది ఓటర్ కార్డులను కూడా అనుసంధానం చేయడం జరిగిందని వివరించారు. ఏడాది పాటు ఎబిసి కో ఆర్డినేటర్లకు శిక్షన ఇవ్వడం జరిగిందని, ఓటర్ మ్యాపింగ్లో పకడ్బందీగా కార్యక్రమాలు తీసుకున్నామని తెలిపారు. 

ఇకపోతే ఎఐసిసి సంస్థాగ‌త వ్య‌వ‌హారాల ఇంచార్జ్ అశోక్ గెల్హ‌ట్ స‌హాయ‌కులు  దీపక్ ఆమెన్  తెలంగాణ కోసం రూపొందించిన సాంకేతిక సమాచారాన్ని ప్రెసేంటేషన్ ద్వారా వివరించారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు ఉన్న స‌మాచార వ్య‌వ‌స్థ‌ను, సాంకేతికంగా అనుసంధానం చేసినవిధానాన్ని ఆయ‌న వివ‌రించారు. ఇటీవ‌లే పార్టీలో చేరిన సాంకేతిక నిపుణులు మాదవరావ్ సాంకేతికంగా కాంగ్రెస్ మరింత ముందుకు పోవడానికి అవసరమైన సమాచారాన్ని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో ఎల్.డి.ఎం.ఆర్.సి కో ఆర్డినేటర్ హర్కర వేణుగోపాల్, ఎం.ఎల్.ఎలు రామ్మోహన్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్, మాజీ ఎం.ఎల్.ఎ లు కె.ఎల్.ఆర్,వంశీ, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవన్ తదితరులు పాల్గొన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios