తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దూకుడు: అభ్యర్థుల ఎంపికపై నేడు స్క్రీనింగ్ కమిటీ భేటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటనకు  కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇవాళ  నిర్వహించే  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ  అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనుంది.

Congress Telangana Screening Committee meet Today For Candidates  Finalise lns


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ ను మరింత పెంచింది. అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ  ఆదివారంనాడు నాడు న్యూఢిల్లీలో భేటీ కానుంది.ఇప్పటికే  70 మంది  అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సుమారు  45 మంది అభ్యర్థుల జాబితా పూర్తైంది. మిగిలిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను  పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.   రానున్న వారం రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు  ఇవాళ  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ  భేటీ కానుంది. 

ఇతర పార్టీల నుండి వలస వచ్చిన నేతలకు కూడ  జాబితాలో  చోటు దక్కే అవకాశం ఉంది.ఒకే పేరున్న అభ్యర్థుల పేర్లున్న జాబితాను స్క్రీనింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు, మూడు అభ్యర్థుల పేర్లున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై  స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు అవకాశాలపై  కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాకర్త  సునీల్ కనుగోలు  సర్వే రిపోర్టు ఆధారంగా  అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు. మరో వైపు  ఈ నెల రెండో వారంలో  బస్సు యాత్ర చేయాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.ఈ నెల  15వ తేదీ నుండి బస్సు యాత్రకు  ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది. బస్సు యాత్ర నాటికి అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేయాలని  కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. ఈ దిశగా  ఇవాళ  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో  అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ నెల  10వ తేదీన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ  సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాకు  కాంగ్రెస్ ఎన్నికల కమిటీ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.  ఈ నెల 15 లోపుగా అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే అవకాశం ఉంది.

also read:రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం: మేనిఫెస్టో‌పై కాంగ్రెస్ కసరత్తు

సీపీఐ, సీపీఎంలతో పొత్తుతో వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే  ఈ రెండు పార్టీలతో పొత్తుల విషయమై  కాంగ్రెస్ నాయకత్వం  చర్చించింది. అయితే  ఇంకా  పొత్తుల విషయమై  ఈ పార్టీల మధ్య అవగాహన  కుదరలేదు.  అభ్యర్థుల జాబితాను ప్రకటించే సమయానికి పొత్తుల ప్రక్రియ పూర్తి కానుందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios