రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం: మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదలకు సంబంధించి కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేసింది. మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే పథకాలకు చోటు కల్పించనుంది కాంగ్రెస్.
రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం: మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని మేనిఫెస్టో రూపకల్పనపై కాంగ్రెస్ పార్టీ వేగాన్ని పెంచింది. బస్సు యాత్రకు ముందే మేనిఫెస్టోను విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తుంది
రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం: మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
రెండు రోజుల క్రితం మాజీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు.
రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం: మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
గత నెలలో ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు కలిశారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలకు ఖర్గే పలు కీలక సూచనలు చేశారు. అమలు చేయగలిగిన అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని ఖర్గే తెలంగాణ నేతలకు సూచించారు. ఈ దిశగా కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టోను రూపొందించనున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ స్కీమ్‌లను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది
రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం: మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీ స్కీమ్ లను ప్రకటించింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటక తరహాలోనే ఆరు గ్యారంటీ స్కీమ్ లను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ ఆరు గ్యారంటీ స్కీమ్ లతో పాటు మరిన్ని అంశాలను మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపర్చనుంది.
రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం: మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
చౌకధరల దుకాణాలు(రేషన్ ) ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను కూడ పంపిణీ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది.ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చనుంది. రేషన్ డీలర్ల కమీషన్ పెంపుపై కూడ మేనిఫెస్టోలో పొందుపర్చనున్నారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా లబ్దిపొందేలా ఓ పథకం కోసం మేనిఫెస్టోలో చేర్చనున్నారు.
రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం: మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
ఇళ్లు కట్టుకోవాలనుకున్న వారికి రూ.5 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించనున్నారు.ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు తీసుకు వస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వనుంది. సీపీఎస్ ను రద్దు చేస్తామని కూడ ఆ పార్టీ ప్రకటించనుంది.హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమ్ ను కొనసాగిస్తున్న విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం: మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
విద్య, వైద్యం, వ్యవసాయం,ఉద్యోగాల భర్తీ వంటి అంశాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటించిన డిక్లరేషన్లకు సంబంధించిన అంశాలను కూడ మేనిఫెస్టోలో చేర్చనున్నారు. విద్యార్థులకు ఉచితంగా ఇంటర్ నెట్ అంధించే అంశాన్ని కూడ మేనిఫెస్టోలో పొందుపర్చనున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే అవకాశం ఉంది.
రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం: మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించి ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో ఓ కంట్రోల్ రూమ్ ను కూడ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి కూడ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మెన్ శ్రీధర్ బాబుతో చర్చించారు. విద్యా వ్యవస్థ ఎలా ఉండాలనే దానిపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మరో వైపు సోషల్ డెమోక్రటిక్ ఫోరం సభ్యులు కూడ కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి సూచనలు చేశారు.
రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం: మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
ఇదిలా ఉంటే మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు టీమ్ కూడ కొన్ని సూచనలు చేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.జిల్లాల వారీగా పర్యటించి మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.