జనగామ: కాంగ్రెసు తెలంగాణ నేత వి. హనుమంతరావును పోలీసులు సోమవారం ఉద్యమం జనగామ సమీపంలోని పెంబర్తి వద్ద అదుపులోకి తీసుకున్నారు రైతుల ఆందోళనకు మద్దతుగా వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో దీక్ష చేయడానికి ఆయన బయలుదేరారు. ఆయనను పోలీసులు పెంబర్తి వద్ద అడ్డుకుని అరెస్టు చేశారు.

తన అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై విహెచ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత కెసీఆర్ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు 

కేసీఆర్ నేరుగా బిజెపికి మద్దతు ప్రకటించాలని, దొంగచాటు వ్యవహారాలు వద్దని ఆయన సలహా ఇచ్చారు. వ్యవసాయ బిల్లులపై, రైతులపై కేసీఆర్ తన వైఖరిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.