Asianet News TeluguAsianet News Telugu

ఓటర్లను ప్రలోభపెడుతున్నారు: కేటీఆర్‌పై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. డబ్బులు తీసుకోవాలని ఓట్లు వేయాలని  కేటీఆర్ చేస్తున్న ప్రచారంపై  ఫిర్యాదు చేశారు.

Congress Telangana Committee Complaints Against KTR To CEC lns
Author
First Published Oct 11, 2023, 3:43 PM IST

హైదరాబాద్:  తెలంగాణ మంత్రి కేటీఆర్ పై  కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.  డబ్బులు తీసుకొని ఓట్లు వేయాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై  కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత వేణుగోపాలస్వామి ఈ విషయమై  సీఈసీకి ఫిర్యాదు చేశారు.

డబ్బులు ఇస్తే తీసుకొని ఓటు వేయాలని మంత్రి కేటీఆర్  ఎన్నికల సభల్లో  ప్రజలను కోరుతున్నారు.ఈ విషయమై  కాంగ్రెస్ నేత  ఫిర్యాదు చేశారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల  9వ తేదీన విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని అధికారులు ప్రకటించారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో  అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలు, అభ్యర్థుల ప్రకటన లపై కేంద్రీకరించాయి.  అభ్యర్థులను ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది.ఈ నెల  15 నుండి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నెల  15 నుండి కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలు నిర్వహించనుంది.  బస్సు యాత్ర తర్వాత  అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.  ఈ నెల 15న  బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. 35 మందితో  బీజేపీ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం లేకపోలేదు.

కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల  1,3 తేదీల్లో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన బీజేపీ సభల్లో పాల్గొన్నారు. నిన్న ఆదిలాబాద్ లో జరిగిన సభలో అమిత్ షా పాల్గొన్నారు.ఈ నెల  15న  కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నారు. ప్రియాంక తర్వాత రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడ  బస్సు యాత్రలో పాల్గొనేలా కాంగ్రెస్ నేతలు రూట్ మ్యాప్ ను సిద్దం  చేశారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios