Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు: ఏకమైన కాంగ్రెస్,టీడీపీ,సీపీఐ

 తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విపక్షాలు అన్నీ మహాకూటమి దిశగా అడుగులు వేశాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్,సీపీఐ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి మహాకూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడమే తమ లక్ష్యమని తెలంగాణలో ఏర్పాటు అయిన మహాకూటమి స్పష్టం చేసింది.

congress, tdp and cpi forming mahakutami in telangana
Author
Hyderabad, First Published Sep 11, 2018, 7:33 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విపక్షాలు అన్నీ మహాకూటమి దిశగా అడుగులు వేశాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్,సీపీఐ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి మహాకూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడమే తమ లక్ష్యమని తెలంగాణలో ఏర్పాటు అయిన మహాకూటమి స్పష్టం చేసింది.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో భేటీ అయిన కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సీపీఐ పార్టీలు తాము మహాకూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేశాయి. ఈ సమావేశంలో ఎన్నికల పొత్తు, సీట్లు పంపకాలపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. 

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటు అయినట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుకోవాలన్న లక్ష్యంతో తామంతా మహాకూటమిగా ఏర్పాటు అయినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన సాగుతుందని ఆ పాలనను అంతం చెయ్యడమే మహాకూటమి లక్ష్యమన్నారు. 

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీతో కుమ్మక్కై కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ రాజకీయ మనుగడకోసమే ముందస్తు ఎన్నికల డ్రామా అంటూ అభివర్ణించారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని రమణ మండిపడ్డారు. 

తెలంగాణలో కేసీఆర్ నియంత్రత్వ ధోరణి పెరిగిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య గొంతును నొక్కేలా ఫిరాయింపుల ద్వారా ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణలో నైజాం నమూనా పరిపాలన సాగే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ నిర్భంధాల తెలంగాణగా మారిపోతుందని ప్రజాస్వామ్య హక్కులు కాలరాయబడతాయన్నారు. 

మరోవైపు మూడు పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నాయి. మూడు పార్టీలు ఏకమై ఒకే మేనిఫెస్టోను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే  ఇతర పార్టీలను కూడా కలుపుకుని ఒకే మేనిఫెస్టో రూపొందించి బహిరంగ సభలను నిర్వహించాలని చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మహాకూటమి నేతలు ఢిల్లీ బాటపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల కమిషన్ నిపుణులన కలవడంతోపాటు, ముందస్తు ఎన్నికలపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios