రాజగోపాల్ రెడ్డి వెంట పయనం: నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులపై వేటేసిన కాంగ్రెస్

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్తున్న నాలుగు మండలాలకు చెందిన  నేతలపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకొంది.  నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది,.

Congress Suspend Four Mandal Party Presidents In munugode Assembly Segment

నల్గొండ: Munugodeఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddy వెంట వెళ్తున్న Congressనేతలపై ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటి. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు మండలాలున్నాయి. తాజాగా ఏర్పడిన గట్టుప్పల్  మండలంతో ఈ నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలున్నాయి. అయితే నాలుగు  మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్తున్న నాలుగు మండలాలకు చెందిన వారిపై చర్యలు తీసుకోవాలని  తీర్మానం చేశారు. ఈ తీర్మానాల ఆధారంగా నాలుగు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల అధ్యక్షులపై చర్యలు తీసుకున్నారు.మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, చండూరు మండలాల అధ్యక్షులపై  కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లే నేతలపై చర్యలు తీసుకోవాలని కూడా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.

 మునుగోడు ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని త్వరలోనే కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని కూడా అందిస్తానని కూడా రాజగోపాల్ రెడ్డి మంగళవారం నాడు ప్రకటించారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో  ముఖ్య నేతలతో రాజగోపాల్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న హైద్రాబాద్ లో రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో కూడా కొందరు నేతలు ఆయనతో పాటే సమావేశంలో పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఇవాళ కూడా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే తమ పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపునకు పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనుంది. ఆయా మండలాల్లో పర్యటిస్తూ నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై చాలా కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని కూడ రాజగోపాల్ రెడ్డి గతంలో ప్రకటించారు.పార్టీని వీడొద్దని కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డితో చర్చలు జరిపే సమయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.  మోడీ నాయకత్వంలో బీజేపీ సర్కార్ దేశంలో సమర్ధవంతమైన పాలనను అందిస్తుందని కూడా రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ నేతల కౌంటర్.. రేవంత్‌పై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకోమన్న మల్లు రవి..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానంలో తన పట్టును నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios