సోషల్ మీడియాలో తనపై జరిగిన కుట్రపై సిసిఎస్ డిసిపి మహాంతి కి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బిసిలకు ప్రాధాన్యత లేదు అన్న తప్పుడు భావనను ప్రజల్లోకి చొప్పించి తద్వారా లబ్ధి పొందాలన్న కుట్ర ఉంది.

అంతేకాదు మొక్కలాగా ఎదుగుతున్న నన్ను మొగ్గలోనే తుంచేయాలన్న కుట్ర ఉంది. నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అస్థిరత సృష్టించే ప్రతయ్నం చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అడుగు జాడల్లో నడిచిన వాడిని.. మీ చిల్లర మల్లర ప్రయత్నాలతో నన్ను ఏమీ చేయలేరన్నారు. దాసోజు శ్రవణ్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.