ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ కు డిఎంకె స్టాలిన్ షాక్

Congress should join anti - BJP front: DMK
Highlights

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు డిఎంకె నేత స్టాలిన్ షాక్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు.

చెన్నై: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు డిఎంకె నేత స్టాలిన్ షాక్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు. బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా కూటమి కట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తుండగా బిజెపికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో కాంగ్రెసుతో నెయ్యం తప్పదనే వాదనను డిఎంకె అభిప్రాయపడుతోంది.

అదే విషయాన్ని స్టాలిన్ కేసిఆర్ తో చెప్పినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు అర్థమవుతోంది. 

1996 -98 యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగాన్ని దృష్టిలో పెట్టుకుని డిఎంకె జాగ్రత్తగా అడుగులు వేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ నిధులు ఇవ్వాలని, ఆరోగ్యం, విద్య వంటి కొన్ని కీలక రంగాలను రాష్ట్రాల పరిధిలోకి తేవాలని, దేశంలో లౌకికవాదాన్ని పరిరక్షించాలనే విధానాలపై స్టాలిన్ తో కెసిఆర్ ప్రధానంగా చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.

ఆదివారంనాడు కెసిఆర్ స్టాలిన్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత కనిమొళి కేసిఆర్ తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పార్టీల కూటమికి డిఎంకె వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల కూటమి వల్ల తాము వ్యతిరేకించే పార్టీకే ప్రయోజనం చేకూరుతందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. 

సంకీర్ణంలో కాంగ్రెసును కలుపుకోవాలని డిఎంకె అభిప్రాయపడుతోంది. చాలా విషయాలపై డిఎంకెకు, టీఆర్ఎస్ కు మధ్య ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ కాంగ్రెసు విషయంలోనే విభేదాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. బిజెపిని ఓడించడానికి బయలుదేరినప్పుడు కాంగ్రెసు లేకుండా సాధ్యం కాదని డిఎంకె నేతలు అంటున్నారు. 

తమిళనాడులో కాంగ్రెసుకు, బిజెపిక మధ్య పొత్తు కొనసాగుతోంది. పదేళ్ల పాటు ఆ రెండు పార్టీలు కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ను వాడుకుని తమిళనాడులో కాంగ్రెసు నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చుననే ఆలోచన బిజెపికి ఉండవచ్చునని చెబుతున్నారు.

loader