హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించాలని డిమాండ్ చేశారు. 

ఇప్పటికే గవర్నర్ గా నరసింహన్ పనిచేయరంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వీహెచ్ ఈసారి ఏకంగా ఆయనను తప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించాలంటూ లేఖ రాశారు. 

ఇకపోతే గతంలో కూడా గవర్నర్ నరసింహన్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు వీహెచ్. గవర్నర్ టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మారారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. నరసింహన్ గవర్నర్ గా కంటే పూజారిగానే పనికి వస్తారంటూ వీహెచ్ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.