హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహ రచన కమిటీ ఛైర్మన్‌ వి.హన్మంతరావు ఏపీ సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజాకూటమిలో సీట్ల పంపకంపై పంతానికి పోవద్దని టీ-టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించడం హర్షణీయమని వీహెచ్ అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అలాగే చంద్రబాబుకు తన అభినందనలు తెలిపారు.  

బీసీలకు సీట్ల కేటాయింపులపై ఢిల్లీలో జరిగిన సమావేశానికి తనను పిలవకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు వీహెచ్. సమావేశానికి తనను ఎందుకు పిలవలేదో అన్న అంశంపై స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులైన భక్త చరణ్‌దాస్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నిలదీస్తానన్నారు. 

తనతో పాటు పొన్నాల లక్ష్మయ్య, ఆనంద్‌ భాస్కర్‌ను ఎందుకు ఆహ్వానించలేదో వారు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు 34 సీట్లు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరనున్నట్లు వీహెచ్ తెలిపారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెండేసి సీట్ల చొప్పున అడుగుతామని స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

లక్ష్యం 2019 లోకసభ ఎన్నికలు: తెలంగాణలో చంద్రబాబు త్యాగం

ఆ సీట్లు వదులుకోవద్దు: తెలంగాణ నేతలకు బాబు సూచన

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సినీనటి