Asianet News TeluguAsianet News Telugu

సొంతపార్టీ కాంగ్రెస్‌పైనే వీహెచ్ సంచలన విమర్శలు

ముక్కుసూటిగా మాట్లాడుతూ తరచూ వివాదాలకు కారణమయ్యే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వి హన్మంతరావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆసారి సొంత పార్టీ కాంగ్రెస్ విధానాలపైనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి  కాకుండా డబ్బున్న బడాబాబులకే అవకాశాలు లభిస్తున్నాయని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.

congress senior leader vh sensational comments on his own party
Author
Hyderabad, First Published Apr 13, 2019, 1:27 PM IST

ముక్కుసూటిగా మాట్లాడుతూ తరచూ వివాదాలకు కారణమయ్యే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వి హన్మంతరావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆసారి సొంత పార్టీ కాంగ్రెస్ విధానాలపైనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి  కాకుండా డబ్బున్న బడాబాబులకే అవకాశాలు లభిస్తున్నాయని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.

అన్ని పార్టీల  మాదిరిగానే కాంగ్రెస్ లో కూడా సామాన్యులకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లభించడంలేదన్నారు. ఎన్నికల్లో ఎంత ఎక్కువగా డబ్బు ఖర్చుపెట్టే సామర్థ్యం వుంటే అంత తొందరగా పార్టీలో అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలా ఇతర పార్టీలతో పాటు కాంగ్రెస్ లో కూడా ధనికులకే టికెట్లు కేటాయించి ఎన్నికల్లో పోటీకి నిలిపిందని విమర్శించారు. 

దీనివల్ల కాంగ్రెస్ పై నమ్మకంతో ఎంతోకాలంగా అంటిపెట్టుకుని వున్న సీనియర్లకు సరైన గుర్తింపై లభించడంలేదన్నారు. కొత్తగా వచ్చి చేరుతున్న డబ్బులున్న నాయకులకు అధిక ప్రాధాన్యత లభించడం  వల్ల సీనియర్ నాయకులు, నిజాయితీతో పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని వీహెచ్ ఆరోపించారు. ఈ విధానంలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా తెలంగాణ సమాజంలోనే కాదు రాజకీయాల్లోనూ అగ్రకుల ఆధిపత్యం కనిపిస్తోందన్నారు. అణగారిన వర్గాలకు అన్ని పార్టీల్లోఅవకాశాలు అరుదుగా  వస్తున్నాయని...కాంగ్రెస్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని వీహెచ్ వ్యాఖ్యానించారు.

Follow Us:
Download App:
  • android
  • ios