మట్టపల్లి బ్రిడ్జికి కాంగ్రెస్ హయాంలోనే రూ.50 కోట్లు మంజూరు చేశామని గుర్తుచేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన అప్రోచ్ రోడ్డు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందని ఎద్దేవా చేశారు.

చివరికి బ్రిడ్జి ప్రారంభోత్సవానికి గౌరవప్రదమైన ఆహ్వానం కూడా అందలేదన్నారు ఉత్తమ్. జాతీయ రహదారుల ఓపెనింగ్‌కు పిలవడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీకలకు ప్రోటోకాల్ పాటించడం లేదని.. ప్రోటోకాల్ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని, స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హెచ్చరించారు.

మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ రైతులకు సంకెళ్లు వేసిన ప్రభుత్వం ఇదంటూ ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని... అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లు లేరని మండిపడ్డారు.

గెలిచినోడు లేడని.. ఓడినోడు లేడని వీహెచ్ వ్యాఖ్యానించారు. పనిచేయాలంటే ఇన్‌చార్జ్‌లు కావాలి కదా అని మండిపడ్డారు. మంత్రులు, కలెక్టర్‌ వస్తే ఘోరావ్ చేయాలని హనుమంతన్న పిలుపునిచ్చారు. కొనుగోలు కేంద్రాలు ఎందుకు తీశారని గల్లా పట్టుకోవాలని, జైలుకు పోయినవాళ్లే లీడర్‌ అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.