Asianet News TeluguAsianet News Telugu

పార్టీ మారను..కాంగ్రెస్ లోనే ఉంటా: దామోదర రాజనర్సింహ

తాను పార్టీ మారతానంటూ వస్తున్న పుకార్లను నమ్మెుద్దని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ నేతల భేటీలో పాల్గొన్న రాజనర్సింహ తాను పార్టీ మారతాననేది కేవలం పుకార్లు మాత్రమేనన్నారు. 
 

congress senior leader damodara rajanarsimha comments
Author
Hyderabad, First Published Sep 5, 2018, 9:00 PM IST

హైదరాబాద్: తాను పార్టీ మారతానంటూ వస్తున్న పుకార్లను నమ్మెుద్దని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ నేతల భేటీలో పాల్గొన్న రాజనర్సింహ తాను పార్టీ మారతాననేది కేవలం పుకార్లు మాత్రమేనన్నారు. 

టీఆర్ఎస్ ఎంపీ డీఎస్ ను తిరిగి కాంగ్రెస్ లోకి రావాలంటూ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని ఎవరైనా రావొచ్చు అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి..టిక్కెట్లు ఎవరికి కేటాయించాలి అనే అంశాలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 

ముఖేష్ గౌడ్ నివాసంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహతోపాటు అందుబాటులో ఉన్న నేతలతో చర్చించారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్, పార్టీ ప్రచారంపై దృష్టి సారించాలని యోచిస్తుంది. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీలతో ఏయే ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలి అన్న అంశాలపై చర్చించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios