కేసిఆర్ రైతుబంధు సూపర్.. కేక : కాంగ్రెస్ సర్పంచ్ (వీడియో)

First Published 17, May 2018, 3:37 PM IST
congress sarpanch says rythu bandhu scheme is super
Highlights

కాంగ్రెస్ కు షాకింగ్ న్యూస్..

కేసిఆర్ రైతుబంధు సూపర్.. కేక : కాంగ్రెస్ సర్పంచ్

కేసిఆర్ రైతుబంధు పథకాన్ని టిఆర్ఎస్ నేతలు ఆహా ఓహో అని పొగడుతుంటారు. అది సహజం. అందులో మంచి ఉన్నా, చెడు ఉన్నా టిఆర్ఎస్ లో ఉన్నవారంతా పొగడాల్సిందే. అయితే ఆ పథకంలో లోటుపాట్లు ఉంటే కొందరు అసంతృప్తవాదులు రహస్యంగా మీడియావాళ్లకు సమాచారం లీక్ చేస్తుంటారు. పైకి పొగుడుతూనే లోగుట్టును వెల్లడిస్తుంటారు. మరి టిఆర్ఎస్ వారు ఎలాగైతే ఈ పథకాన్ని పొగుడుతారో ప్రతిపక్ష నేతలు పార్టీలు విమర్శిస్తుంటారు. ఇది కూడా సహజమే. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మహిళా సర్పంచ్ కేసిఆర్ రైతుబంధు పథకం సూపర్, కేక అని పొగడ్తల జల్లు కురిపించారు. ఆ వివరాలేంటో చదవండి. వీడియో చూడండి.

"

సూర్యాపేట జిల్లాలో అధికార టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు స్థానిక ప్రజా ప్రతినిధులంతా టిఆర్ఎస్ గూటికి చేరిపోయారు. కానీ సోలిపేట గ్రామ సర్పంచ్ బీరవోలు శోభారెడ్డి. మాత్రం గులాబీ గూటికి చేరలేదు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని ప్రకటించింది. కానీ.. ఆమె తాజాగా తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతుబందు పధకంపై ప్రశంసలు కురిపించింది. రైతుబందు పధకం అమలులో బాగంగా గరువారం ఉదయం సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సర్పంచ్ శోభారెడ్డి మాట్లాడుతూ రైతుబందు పధకం తెలంగాణా రైతాంగానికి గొప్పవరం అంటూ కొనియాడారు. ఆమె మాటలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి.

loader