అప్పుడు సమయం సాయంత్రం ఏడున్నర అయితున్నది. అది గాంధీభవన్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ చేపట్టిన దీక్షా శిబిరం.. శిబిరంలో వేటుకు గురైన ఎమ్మెల్యే సంపత్ అనర్గళంగా మాట్లాడుతున్నారు. కేసిఆర్ మీద కత్తులు దూస్తున్నారు. సంపత్ ప్రసంగం కార్యకర్తలను, నాయకులను ఉర్రూతలూగిస్తున్నది. అంతలోనే షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడేమైందంటే..? చదవండి.

గాంధీభవన్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష పేరుతో అసెంబ్లీలో సభ్యత్వాన్ని కోల్పోయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ దీక్ష చేస్తుండగా ఒక సన్నివేశం జరిగింది. సభలో సంపత్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో ఆయనకు కొంత ఇబ్బంది ఏర్పడింది. సభలో దిక్కులు పిక్కటిల్లేలా సంపత్ గంభీరమైన గొంతుతో మాట్లాడుతున్నారు. అయితే ఆయన ప్రసంగంలో బిడ్డా.. కేసిఆర్.. అన్నారు. ఆ సమయంలో గొంతు బొంగురు పోయింది. పులిలా మాట్లాడిన మనిషి గొంతు పిల్లిలా మారింది. వెంటనే పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నీళ్ల బాటిల్ ఇచ్చారు. సంపత్ ఆ నీళ్లు తాగి మళ్లీ సభను ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ గొంతు మాత్రం రాలేదు. దీంతో సభలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలే కాదు.. దీక్షా శిబిరంలో కూర్చున్న నాయకులు సైతం పెద్దగా నవ్వారు. సంపత్ ఎంతగా ట్రై చేసినా గొంతు రాలేదు. దీంతో పిసిసి ఉత్తమ్ మైక్ తీసుకుని సంపత్ నువ్వు కొద్దిసేపటి తర్వాత మాట్లాడు.. కొద్దిగా రిలాక్స్ కా అంటూ కోరారు. తర్వాత వేరే వక్త మాట్లాడారు.