తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల పశ్చిమబెంగాల్ వెళ్లి అక్కడి సిఎం మమతా బెనర్జీతో కలిసిన విషయం తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం కోసమే కేసిఆర్ ఈ టూర్ చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు, టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ టూర్ ఉద్దేశం వేరే ఉందని , టూర్ లోగుట్టు ఇదేనని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తనదైన శైలిలో చెప్పారు. కేసిఆర్ కోల్ కతా వెళ్లింది ఫెడరల్ ఫ్రంట్ కోసం కాదు ఏం కాదని రేవంత్ వెల్లడించారు. బుధవారం 99 టివి ఛానెల్ లో రేవంత్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కేసిఆర్ కోల్ కతా కు ఎందుకు వెళ్లారు? ఎవరితో వెళ్లారో వివరించారు.

 

కేసిఆర్ మంత్రివర్గ సహచరులే కేసిఆర్ టూర్ పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు రేవంత్ విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. తెలంగాణ ప్రభుత్వంలో సింహభాగం కాంట్రాక్టులన్నీ దక్కించుకున్న ఒక బడా కాంట్రాక్టర్ కూడా కేసిఆర్ వెళ్లిన ఫ్లైట్ లో కోల్ కత్తా వెళ్లినట్లు తనకు సమాచారం అందిందన్నారు. ప్రభుత్వంలోని వ్యక్తులే తనకు సమాచారమిచ్చినట్లు చెప్పారు. కేసిఆర్ కోల్ కత్తా టూర్ గురించి రేవంత్ ఏం మాట్లాడారో వీడియోలో ఉంది చూడండి.