Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ పై పోటీకి రేవంత్ సై.. తెలంగాణ కాంగ్రెస్ అభ్య‌ర్థుల మూడో జాబితా విడుద‌ల

Congress Candidates Third List:  తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరుగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. అధికార పీఠం ద‌క్కించుకోవ‌డానికి దూకుడుగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్.. ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థ‌ల‌కు సంబంధించి ఇప్పటికే రెండు జాబితాలు ప్ర‌క‌టించింది. తాజాగా మూడో అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసింది. 
 

Congress releases third list of Telangana assembly elections candidates RMA
Author
First Published Nov 6, 2023, 10:51 PM IST | Last Updated Nov 6, 2023, 11:05 PM IST

Telangana Assembly Elections 2023:  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే మూడో అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసింది. 16 మంది అభ్యర్థులతో కూడిన 3వ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం విడుదల చేసింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీకి రేవంత్ రెడ్డి సై అన్నారు. రేవంత్ రెడ్డిని కామారెడ్డి నుంచి కూడా కాంగ్రెస్ బ‌రిలోకి దింపింది. ఇప్ప‌టికే ఆయన కోడంగల్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కామారెడ్డి నుంచి ఎన్నికల్లో పోటీకి వెనుకడుగు వేసిన షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్భన్ నుంచి బరిలో దింపారు. 

కాంగ్రెస్ మూడో జాబితాలోని అభ్యర్థులు వీరే..

  1. చెన్నూర్‌ (ఎస్సీ)- డాక్టర్ జీ వివేకానంద
  2. బోథ్‌ (ఎస్టీ)- వెన్నెల అశోక్‌ స్థానంలో గజేందర్‌
  3. జుక్కల్‌ (ఎస్సీ) - తోట లక్ష్మీ కాంతారావు
  4. బాన్సువాడ - ఏనుగు రవీందర్‌ రెడ్డి
  5. కామారెడ్డి - రేవంత్‌ రెడ్డి
  6. నిజామాబాద్‌ అర్బన్ - షబ్బీర్‌ అలీ
  7. కరీంనగర్‌ - పురుమళ్ల శ్రీనివాస్‌
  8. సిరిసిల్ల - కొండం కరుణ మహేందర్‌ రెడ్డి
  9. నారాయణఖేడ్‌ - సురేష్‌ కుమార్‌ 
  10. పటాన్‌చెరు - నీలం మధు ముదిరాజ్‌
  11. వనపర్తి - తూడి మేఘా రెడ్డి 
  12. డోర్నకల్‌ (ఎస్టీ)- డా. రామచంద్రు నాయక్‌
  13. ఇల్లెందు (ఎస్టీ) - కోరం కనకయ్య
  14. వైరా (ఎస్టీ) - రామదాస్‌ మాలోత్‌
  15. సత్తుపల్లి  (ఎస్సీ)- మట్టా రాగమయి
  16. అశ్వారావుపేట (ఎస్టీ) - జారె ఆదినారాయణ
     

Congress releases third list of Telangana assembly elections candidates RMA
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios