మంత్రి కడియంపై కాంగ్రెస్ రవళి ఫైర్ (వీడియో)

congress ravali fire on kadiam srihari
Highlights

ఇదేం పద్ధతి ?

తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి రవళి కూచన ఫైర్ అయ్యారు. టెన్త్ పిల్లల భవిష్యత్తు కంటే మంత్రి కడియం కు కానీ, తెలంగాణ ప్రభుత్వానికి కానీ ప్లీనరీనే ముఖ్యమైందా అని ప్రశ్నించారు.

ప్లీనరీ కోసం టెన్త్ రిజల్ట్స్ వాయిదా వేయడం సిగ్గుచేటన్నారు. గతంలో ఇంటర్ పరీక్షల వేళ ఎమ్మార్పీఎస్ బంద్ ప్రకటన చేస్తే సర్కారు దాన్ని విరమింపజేసిన విషయాన్ని రవళి గుర్తు చేశారు. నీతులు చెప్పే కేసిఆర్ సర్కారు మాత్రం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.

రవళి ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె ఇంకా ఏమన్నారో పైన వీడియోలో చూడండి.

loader