కేసిఆర్ పై కాంగ్రెస్ రవళి ఫైర్ (వీడియో)

కేసిఆర్ పై కాంగ్రెస్ రవళి ఫైర్ (వీడియో)

తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో 12 భాషల్లో దేశమంతా పత్రికా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవళి కూచన.

పత్రికల్లో యాడ్స్ ఇవ్వడమంటే తెలంగాణ వాళ్లకు రైతుబంధు పథకం గురించి తెలియకపోతే తెలియచెప్పడం కోసం ఇవ్వాలి అన్నారు. అలా కాకుండా వెయ్యి కోట్ల రూపాయలు పత్రికల్లో ప్రచారం కోసం వినియోగించడాన్ని తప్పుపట్టారు. రైతుబంధు పేరుతో కోట్లాది రూపాయలను యాడ్స్ రూపంలో ఖర్చు చేయడం దారుణమన్నారు.

వరంగల్ నగరంలో జరిగిన మీడియా సమావేశంలో రవళి అనేక విషయాలను వెల్లడించారు. ఆమె ఏమన్నారో కింద వీడియో ఉంది చూడండి.

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos